పాము నిచ్చెనలు అనేది ఒక పురాతన భారతీయ పాచికలు దొర్లించి ఆడే బోర్డ్ గేమ్, ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక క్లాసిక్‌గా పరిగణించబడుతుంది. దీనిని సంఖ్యలు గల, గ్రిడ్ చేసిన చతురస్రాలతో కూడిన గేమ్ బోర్డుపై ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఆడతారు. బోర్డుపై అనేక "నిచ్చెనలు" మరియు "పాములు" చిత్రీకరించబడి ఉంటాయి, ప్రతి ఒక్కటి రెండు నిర్దిష్ట బోర్డు చతురస్రాలను కలుపుతూ ఉంటుంది. ఆట యొక్క లక్ష్యం ఏమిటంటే, పాచికలు దొర్లించిన సంఖ్య ప్రకారం, ప్రారంభ స్థలం (క్రింద ఉన్న చతురస్రం) నుండి ముగింపు స్థలం (పైన ఉన్న చతురస్రం) వరకు ఆటలోని పావును నడిపించడం. ఈ ప్రయాణంలో నిచ్చెనలు సహాయపడతాయి, పాములు అడ్డుకుంటాయి.