యమ్మీ టాకో ఒక రుచికరమైన వంటల గేమ్. ఇక్కడ ఒక మెక్సికన్ డిష్ చేద్దామా? మనందరికీ టాకో అంటే తెలుసు కదా, ఇష్టపడతాము కూడా. మీరు రుచికరమైన టాకోలను తయారుచేసి, టాకో స్టాల్‌ను నిర్వహించి, ఆకలితో ఉన్న కస్టమర్లందరికీ వడ్డించగలిగే గేమ్ ఇది. ముందుగా పిండిని అవసరమైన పదార్థాలతో నీటితో కలిపి, టాకో చేయడానికి పిండిని రోల్ చేద్దాం, తరువాత టాకోలో నింపడానికి, మాంసం, కూరగాయలను ఉడకబెట్టి, తరిగి సిద్ధం చేయాలి, అయ్యో, మీట్ మిక్సర్ పాడైపోయింది, కాబట్టి ఇక్కడ కొద్దిగా రిపేర్ చేసి మాంసాన్ని సిద్ధం చేయాలి, ఆపై, ఆకలితో ఉన్న కస్టమర్లకు రుచికరమైన మరియు టేస్టీ టాకోలతో వడ్డిద్దాం.