ఉత్తర పసిఫిక్ జలకన్యల యువరాణిగా (ఏడు జలకన్యల రాజ్యాలలో ఒకటి), లూసియా ఒక రాత్రి ఓడ నుండి జారిపడిన అబ్బాయికి ఒక మంత్రపూసను అప్పగిస్తుంది. తన పూసను తిరిగి పొందడానికి మరియు జలకన్యల రాజ్యాలను రక్షించడానికి లూసియా మానవ ప్రపంచానికి ప్రయాణించాలి. సంగీత శక్తిని ఉపయోగించి, పెరుగుతున్న దుష్ట శక్తి నుండి తనను తాను మరియు జలకన్యల రాజ్యాలను రక్షించుకోగలుగుతుంది లూసియా.